ఆపరేషన్ కాగర్ వెంటనే నిలిపివేయాలి.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి.

 భద్రతా బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలి

 మణుగూరు అఖిలపక్ష రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాల డిమాండ్ 

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : మండలం సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం శుక్రవారం నిర్వహించారు. దుగ్యాల సుధాకర్ అధ్యక్షత వహించగా.. బి అయోధ్య,( సిపిఐ) పట్టం నారాయణ దొర (ఆదివాసీ సంగం ఉమ్మడి రాష్ట్రమాజీ అధ్యక్షులు), కాటబోయిన నాగేశ్వరరావు (కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం నాయకులు) మిడిదొడ్ల నాగేశ్వరరావు ( సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు) మల్లెడి లోకేష్ ( టిడిపి మండల అధ్యక్షులు), సత్ర పల్లి సాంబశివరావు (సిపిఎం మండల కార్యదర్శి) జ్యోతి బస్సు (ఆదివాసీ సేన జిల్లా నాయకులు) సోమేశ్వర గౌడ్, పెనుగొండ సాంబ (బీసీ సంఘం నాయకులు)   బోయిల్ల వెంకటేశ్వర్లు (ఎమ్మార్పీఎస్ పినపాక నియోజకవర్గం ఇంచార్జ్), జంగం మోహన్ రావు  (సిపిఐ మండల కార్యదర్శి,). హాజరై మాట్లాడుతూ….. ” ఆపరేషన్ కాగర్ “పేరుతో ఆదివాసీలని పేద ప్రజల పైన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ, అమాయకమైన ప్రజలను హింసిస్తున్నారని ,వేధిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని, ప్రజల ప్రాణాలను రక్షణ లేకుండా బక్షిస్తున్నారని “కగార్ “పేరుతో పోలీసులు చేస్తున్న యుద్ధ వాతావరణాన్ని ని వెంటనే నిలుపుదల చేయాలని, కేంద్ర బలగాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని,  ఆపరేషన్ కాగర్ ని వెంటనే నిలిపివేయాలని, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశాయి. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారన్నారు.

అఖిలపక్ష సమావేశంలో  సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, (గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు) సోందే కుటుంబరావు ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్షులు రాయల భిక్షం, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి ch.లక్ష్మి, ఏఐటీయూసీ కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, బోసెట్టి సతీష్, సిపిఎం జిల్లా నాయకులు గోడిశాల రాములు, ఆదిలక్ష్మి (సిపిఐ ఎంఎల్ నాయకులు), (బీసీ సంఘ నాయకులు) నాగారపు సతీష్ కుమార్, సంజీవరెడ్డి (టి యు సి ఐ నాయకులు) పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ కుమార్, ఉపేందర్ , హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram