గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మండలంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సీఐ బత్తుల సత్యనారాయణ పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు విశ్వసనీయ సమాచారంతో కట్టుగూడెం పాత పెంకు ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకొని ఇల్లందు సీఐ ఆధ్వర్యంలో దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుందామన్నారు , ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ దాడిలో రూ.46 వేలు నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా సీఐ అన్నారు.
Post Views: 63









