పెద్దవాగు సైడ్ వాల్ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గత సంవత్సరం కురిసిన వర్షాలకు పేదవాడు చిరుమళ్ళ, కరకగూడెం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు బ్రిడ్జి సైడ్ వాల్ కోతకు గురి అయింది. ఇరువు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి . గత సంవత్సరం తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ. బ్రిడ్జి వద్ద సైడ్ వాళ్ళ లేకపోవడం వల్ల వర్షాలు పడితే వంతెనకు ఇరువైపులా ఉన్న రోడ్డు కోతక గురవుతుంది. సోమవారం పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు కరకగూడెం పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు పెద్దవాగు బ్రిడ్జి  సమస్యను ఆయనకు  విన్నవించారు. సానుకూలంగా స్పందించిన  ఎమ్మెల పెద్దవాగు బ్రిడ్జిని సందర్శించి రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి బ్రిడ్జి సైడ్ వాల్ నిర్మాణ పనులకు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram