ఆదివాసీ కుటుంబాలకు పోలీసుల అండ

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని జిల్లా ఎస్పీ రోహిత్ రాజన్నారు.  జిల్లా సరిహద్దుల్లోని మారుమూల మావోయిస్టు ప్రభావిత 20 ఆదివాసీ గ్రామాలకు జిల్లా పోలీస్ శాఖ తరఫున రూ.70 లక్షల విలువైన మల్టీపర్పస్ మిల్లులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం  అందజేశారు. రాళ్ల పురం గ్రామంలో ఈ మిల్లును ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసి గ్రామాల ప్రజల ఆర్థిక సోపానమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తోందని  ఆదివాసీలకు ఇలాంటి సేవ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని  ఎస్పీ రోహిత్ రాజు పేరు కొన్నారు.చదువుకున్న యువత గ్రామాల్లోనే ఉండకుండా బయటకు వచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాల ద్వారా తమ కుటుంబాలను చక్కగా పోషించుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ఓ నరేందర్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్  తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram