ఆదివాసీ గ్రామంలో కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రాం

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగళ్ల పంచాయతీలోని ఆదివాసి గ్రామమైన మాదన్న గుంపు లో సోమవారం కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి  కొత్తగూడెం జిల్లా ఓఎస్డి నరేందర్. మణుగూరు డిఎస్ పి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ  సందర్భంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లు, చిన్నారులకు నోట్ బుక్స్, బలపాలు, పొలం పనులకు వెళ్ళే వారు వర్షాల వల్ల ఇబ్బంది పడకుండా 100 ప్లాస్టిక్ కవర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు, పోలీసులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram