రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
గోల్డెన్ న్యూస్ / పాల్వంచ : కులమతాలకతీతంగా త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మొహర్రం అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాత పాల్వంచలోని పీర్ల కొట్టం వద్ద జరిగిన మొహర్రం వేడుకల్లో కొత్వాల పాల్గొని ముస్లిం సోదరులకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం అమరవీరులను పెద్దలను స్మరించుకొనే పండుగ పీర్ల పండుగ అన్నారు. ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు SK ఇమామ్,SK ఉబేద్, ఎస్ డి కరీముల్లా, ఎస్.కె నిజాముద్దీన్, ఎస్ కె అజ్మత్ అలీ, ఎస్.కె యాకూబ్ అలీ, ఎస్ కె గుమ్ము, ఎస్.కె నజీర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 58









