ప్రియురాలి కోసం కట్టుకున్న భార్య నే చంపేశాడు..శాడిస్ట్ భర్త

పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపిన వైనం!

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ :  మరిపేడు మండలం, బాల్యతండాకు చెందిన గణేష్ కు సూర్యాపేట జిల్లా దక్షిణపల్లి గ్రామానికి చెందిన గౌతమీతో ఈ ఏడాది మే 18న వివాహం జరిగింది. గణేష్ కు కోరిన కట్న కానుకలు ఇచ్చి కోరిన విధంగా గ్రాండ్ గా వివాహం చేశారు. అయితే అప్పటికే తన క్లాస్ మేట్ తో ప్రేమయాణం కొనసాగిస్తున్న గణేష్ వరంగల్లో ఆటో డ్రైవింగ్ చేస్తే బాగా సంపాదించవచ్చు అని అందరినీ నమ్మించి భార్యతో సహా వరంగల్లో కాపురం పెట్టాడు.అంతా ఓకే, తాను అనుకున్నట్లే డబ్బు వచ్చింది, ఆటో కూడా కొనుక్కున్నాడు. జీవితం బాగానే సాగుతుంది. మరోవైపు తన క్లాస్ మేట్ తో ప్రేమ కంటిన్యూ చేస్తున్న గణేష్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్యను దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత తన భార్యకు శ్వాస ఆడటం లేదని అందరినీ నమ్మించి 108కి కూడా ఫోన్ చేశాడు.పోలీసుల విచారణ లో తానే హత్య చేసునట్టు ఒప్పుకున్నాడు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram