పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు.
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ / ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు సహా 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టులకు ఇది భారీ ఎదురుదెబ్బ.
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతోపాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, పట్టుబడిన మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు..
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31లోపు మావోయిస్టు రహిత భారత నిర్మాణం లక్ష్యంగా సాయుధ బలగాలతో, ఆధునిక టెక్నాలాజీతో మావోయిస్టుల ఏరివేత కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. దీనికి తోడుగా పలువురు కీలక నేతలు సహా వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడం మరో ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు.









