యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్

 

తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితో చనువుగా మాట్లాడవద్దని వేదింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు

 

రాజేందర్ వైఖరి నచ్చక అతనితో తమ కూతురు వివాహానికి నిరాకరించిన అనిత తల్లిదండ్రులు

 

ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, తనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని గుర్తించిన రాజేందర్

 

దీంతో రాజేందర్ జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి, అనిత గురించి తప్పుడు సమాచారమివ్వగా, అనితను వేధించడం మొదలు పెట్టిన జబ్బార్ లాల్

 

డబ్బులు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని జబ్బార్ లాల్ వేధింపులకు దిగడంతో, రాజేందర్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరి వల్ల నా జీవితం నా నాశనం అయిందని, చావే దిక్కని కన్నీరు పెట్టుకున్న అనిత

 

చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో, గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన అనిత

 

రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram