గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పడిపోయిరైతులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. మదనపల్లె మరియు వరంగల్ వంటి ప్రధాన మార్కెట్లలో 10 కేజీల బాక్స్ రూ.90-140లకు పడిపోగాకేజీ టమాటా హోల్‌సేల్ ధర రూ.7-9కి పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో రూ.300-600 ఉన్న ధరలుఈసారి కనీస మద్దతు ధర కూడా లేకరవాణా ఖర్చులు కూడా రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.50కి 3-4కిలోలు ఇస్తున్నా తమకు కూలి ఖర్చులు సైతం రావట్లేదని వాపోతున్నారు. ఆదివారం అనకాపల్లి లో 30 కిలోల టమాటా ట్రే కేవలం రూ.90 పలికినట్లు చెప్పారు. మొంథా తుఫాను వల్ల సాగు ఆలస్యం కావడం, 15 రోజులుగా పంట కోతకు వస్తుండటంతో ధరలు భారీగా తగ్గాయి.
Post Views: 128









