ఫిట్నెస్ లేని సాని డంపర్లను నిలిపివేసిన డిప్యూటీ డైరెక్టర్

తనిఖీలలో భాగంగా ఫిట్నెస్ లేని సాని డంపర్లను నిలిపివేసిన డిప్యూటీ డైరెక్టర్ మైన్ సేఫ్టీ

 

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / సింగరేణి మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 లో పనిచేస్తున్న విపిఆర్ దుర్గ (డీఐఎంపీఎల్) ఓబీ కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాద సంఘటన నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ దిలీప్ కుమార్ రక్షణ తనిఖీ చర్యలు చేపట్టారు. ఈ తనిఖీలలో లో గుర్తించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు అవసరమైన అనుమతులు లేని సుమారు వందకి పైగా సానీ డంపర్లను నిలిపివేశారు.

గురువారం (రెండో తేదీ ) సెకండ్ షిఫ్ట్ బ్లాస్టింగ్ తర్వాత మొత్తం వాహనాల్లో కేవలం ముప్పై ఐదు భారీ డంపర్ లకే ఫిట్నెస్ అనుమతులు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ఫిట్నెస్ లేని వాహనాల పనులను పూర్తిగా పార్కింగ్ యార్డ్కే పరిమితం అయ్యేలా నిలిపివేశారు.

ఈ ప్రమాద సంఘటన ఒక ఓబి వర్కర్ చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు, ప్రమాద సంఘటనలు పునారవృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అనుక్షణం కార్మికులను సూపర్వైజర్లను అప్రమత్తం చేయాలని , వ్యక్తిగత రక్షణ పరికరాల ధరింపు, పని స్థలాలలో రక్షణ చర్యలు,హాల్ రోడ్స్, లైటింగ్, వాటర్ స్ప్రేయింగ్ తదితర అంశాలలో ప్రమాదాలు నివారణకు చేపట్టవలసిన రక్షణ చర్యలకు సంబంధించి తగు సూచనలతో కూడిన ఆదేశాలు ఓబి యాజమాన్యానికి జారీ చేసినట్లు తెలిసింది, అలాగే పర్యవేక్షణకు సంబంధించి సింగరేణి యాజమాన్యానికి కూడా తగు ఆదేశాలు అనగా కోల్ మైన్స్ రెగ్యులేషన్ (సిఎంఆర్ 2017) నిబంధనల ప్రకారం రక్షణ సూత్రాలు పాటించాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (యస్ యం పి) స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (యస్ ఓ పి) ప్రకారం గనిలో పనిలో గ్యారేజీలో అట్టి ఆదేశాలు అమలు చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram