మొత్తం బకాయిలు 56,000 కోట్లు
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి మణుగూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల రక్తాన్ని చమటగా చేసి ఉత్పత్తి చేసిన బొగ్గుకు రాష్ట్ర ప్రభుత్వం 56,000 కోట్లు చెల్లించాల్సి ఉందని . రావలసిన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను దివాళి తీసే విధంగా తయారు చేస్తున్నారన్నారు. దానివల్లే సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పది ఏళ్ల పాలించిన వారిదా,మూడేళ్లు పాలకులదా అనేది, కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 కోట్లు బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాడిచర్ల బ్లాక్ సింగరేణికి కేటాయించాలని దాదాపు 12 ఏళ్లకు ఆందోళన జరిగాయి. దానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో సింగరేణి మనుగడ కోసం సింగరేణి సంస్థకు అప్పగించారన్నారు.
కెసిఆర్ పాలనలో ప్రైవేటీకరించిన బొగ్గు బ్లాకు కంపెనీలను రద్దు చేస్తే నాపై కంపెనీ యజమానులు కేసులు వేశారని. కోర్టులో తేల్చుకుంటామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సింగరేణి కాపాడుకోవాలన్నారు. సింగరేణి అస్తిత్వం దెబ్బతింటే సంఘాలు ఉండవు, రాజకీయ పార్టీలు ఉండవన్నారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మణుగూరు మనుగడ కోల్పోకుండా సింగరేణి పీకే ఓసి టు డిప్ సైడ్ బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించాలని మంత్రి కిషన్ రెడ్డికి ఏఐటీయూసీ నాయకులు రామ్ గోపాల్.వినతిపత్రం అందజేశారు…
మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో కనీస వసతులు వసతులు కరువు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు…
మణుగూరు పీకే ఓసి టు గనిలో పర్యటించిన కేంద్ర మంత్రి మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ క్రమంలో బిజెపి నాయకులు అధికారులపై మండిపడ్డారు. కనీసం త్రాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఎవరికి పెడతారు కాంగ్రెస్ వాళ్లక, కమ్యూనిస్టులు కా,.. ఎవరికి పెడతారు అంటూ బిజెపి నాయకులు ప్రశ్నించారు..









