జేపి నడ్డతో సీజేపీ నాయకుల భేటీ

 

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోజ్ జనతా పార్టీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే ఆశా భావం వ్యక్తం చేస్తున్నట్లు సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు.  సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాకు తమ డిమాండ్లతో కూడిన అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం తమ సమస్యలపై పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తమ మద్దతుదారులకు శాంతిని పాటించాలని సీజేపీ నేతలు కీలక విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనకారులను బలవంతంగా తొలగించే ఆలోచన లేదని వర్గాల సమాచారం. ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్స్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram