గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / వ్యక్తి అదృశ్యమైన ఘటన కరకగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అనంతరం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన పాయం సుమన్ వయస్సు (32) అనే వ్యక్తి ఈనెల 15 న మధ్యాహ్నం రెండు గంటలకు మణుగూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు.దీంతో కుటుంబసభ్యులు, తెలిసిన వారిని, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య పాయం శైలజ మంగళవారం కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సంప్రందించవల్సిన నెంబర్లు
8712682103,
Post Views: 1,136









