గోల్డెన్ న్యూస్ /నంద్యాల / అర్ధశతాబ్దం తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామానికి దాదాపు 48 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. రాష్ట్రమంతా ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆ గ్రామస్థులు మాత్రం..
విద్య, వైద్యం కోసం దాదాపు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. ప్రజల కష్టాలు గమనించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, పార్లమెంటు ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బస్సుకు పూజలు చేసి ఆహ్వానం పలికారు.
Post Views: 35









