గోల్డెన్ న్యూస్/ భద్రాచలం / వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో 11.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. రామాలయం ఎదురుగా అన్నదాన సత్రంలోకి బ్యాక్వాటర్ చేరుతోంది. కరకట్ట స్లూయిజ్ల వద్ద మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నీటి ఎత్తిపోతల పనులు నిలిచిపోయాయి. గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్లు వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Post Views: 153









