క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు 10న జైలు బరో -సిఐటియు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపట్టనున్న జైలు బరో కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టంలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి 29 చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు భరోసా కార్యక్రమంను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు కేంద్ర నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినందున ఢిల్లీలో రైతాంగం ఏడాది పాటు చేపట్టిన నిరసన కార్యక్రమం తలొగ్గి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి ఆ చట్టాలు రద్దు చేసిందన్నారు అలాగే జన్ జీ, కాక్రోచ్ జనతా పార్టీ, యువత నీట్ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మిలటరీ బలగాలను ప్రయోగించి హింసాత్మక ఘటన కొనసాగించిందనీ వారు విమర్శించారు ధైర్యంతో పోరాటం కొనసాగించారని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి ఓడిపోయి విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయించిందని వారు అన్నారు కార్మిక పోరాటాలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తలగ్గి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రంగం నాయకులు భవాని, మంగతాయారు,పద్మ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram