గోల్డెన్ న్యూస్/ కరకగూడెం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, చొప్పాల గ్రామ పంచాయతీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి మెంగయ్య గారు ఇటీవల మృతి చెందాడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ స్థానిక సర్పంచ్ తోలెం సావిత్రి శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి దశదిన కర్మల నిమిత్తం 50 కేజీల బియ్యాన్ని, కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన తోలెం సారయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని, వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు తోలెం కృష్ణ, ఉప సర్పంచ్ కుమ్మరి సమ్మయ్య, సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య, కోర్స బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17









