ఈ నెల 29న శనివారం భద్రాద్రి జిల్లా పర్యటనకు రానున్న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి
హెలిపాడ్,ఎత్తి పోతల పథకం కెనాల్,సభా స్థలాన్నీ పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
పనులన్నీ సకాలంలో పూర్తిచేయాలి,పినపాక ఎమ్మెల్యే పాయంతో కలిసి అధికారులకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్
అశ్వాపురం : మండలంలోని మారెళ్లపాడు ఎత్తి పోతల పథకం ఈనెల 29న శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి,వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు హజరుకానున్నారు.
సీతారామా ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన మారెళ్ల పాడు ఎత్తిపోతల పథకం పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కలిసి గురువారం
పరిశీలించారు. ముందుగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు భద్రాద్రి జిల్లా చేరుకునే అశ్వాపురం మండలంలోని బీ.జీ కొత్తూరు ప్రాంతంలోని హెలిపాడ్ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పనులపై సలహాలు, సూచనలు అదికారులకు తెలియజేశారు.
అదేవిధంగా మంత్రులు ప్రారంభించనున్న సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో మారెళ్లపాడు ఎత్తి పోతల పథకం కెనాల్,గొందిగూడెం – జీ.కొత్తూరు పల్లె ప్రకృతి ముందుగల ప్రాంతంలోని
సభా స్థలాన్నీ పరిశీలించారు.ఈ క్రమంలో అక్కడ కొనసాగుతున్న పనులను త్వరితగదిన పూర్తి చేయాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు.పథకం ప్రారంభోత్సవ సందర్భంగా పనులతీరు, మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు.
మంత్రుల పర్యటన
ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని,ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ వసతులు కల్పించాలని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఈ.ఈ వెంక టేశ్వరరావు, డీ.ఈ శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









