అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్

అనురాగాల బంధం.. ఆప్యాయతల అనుబంధం తరగని మమకారం చెదరని జ్ఞాపకం ప్రతికూల పరిస్థితుల్లోనూ నేనున్నాననే భరోసా..

అదే రక్షాబంధన్ అక్కా తమ్ముళ్లు.. అన్నా చెల్లెల్లు అందరూ వేడుకకు సిద్ధమవుతున్నారు

రాఖీ పండుగ వచ్చిందంటే ఎటు చూసినా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల సందడే! సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుక వేళ.. సోదరి తన సోదరుడి శ్రేయస్సును కోరుతూ అతడి కుడి చేతికి రాఖీ కడుతుంది. ఈ బంధం కేవలం రక్త సంబంధానికే పరిమితం కాదు. బంధుమిత్రుల్లో ఎవరైనా సరే తమ ఆత్మీయులకు రాఖీ కట్టి నిష్కల్మషమైన ప్రేమను చాటుకుంటారు.

Facebook
WhatsApp
Twitter
Telegram