మణుగూరు : మణుగూరు పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తన వద్ద పనిచేసే కార్మికుడి సోదరిని కొందరు యువకులు వేధిస్తున్నారని గతంలో వారిని హెచ్చరించినందుకు కక్ష పెంచుకున్న ఓ గ్యాంగ్.. మాట్లాడుకుందామంటూ పిలిపించి మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్..
మణుగూరుకు చెందిన శివ (28) హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు సొంతూరికి వచ్చాడు. అయితే పండుగ రోజే అతడు హత్యకు గురికావడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
శివ వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానికంగా కొందరు యువకులు వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శివ గతంలో వారిని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో శివపై కొందరు యువకులు కక్ష పెంచుకున్నారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
మాట్లాడుకుందామంటూ పిలిచి..
ఈ క్రమంలో MK గ్రూప్కు చెందిన రమ్మీ, అతని అనుచరులు శివను మాట్లాడుకుందామంటూ మణుగూరులోని ఏరియా స్టోర్ గ్రౌండ్స్కు పిలిపించినట్లు చేరుకున్న అనంతరం ముందస్తు పథకం ప్రకారం అతడిపై పలువురు యువకులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం. __ అక్కడికి శివ
సుమారు 30 మంది యువకులు శివపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు పక్కటెముకలు కుప్పకూలిపోయాడు. విరిగిపోవడంతో అతడు మృతి చెందినట్లు సమాచారం.
కాపాడేందుకు వెళ్లిన యువకుడిపైనా దాడి.
శివను కాపాడేందుకు ప్రయత్నించిన ఉదయ్ కుమార్ అనే యువకుడిపై కూడా దాడి జరగడంతో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోదరుడికి చివరి రాఖీ కట్టిన సోదరి
రాఖీ పండుగ రోజున శివ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సోదరుడి మృతదేహం వద్ద అతడి సోదరి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన దృశ్యం కుటుంబ సభ్యులను, స్థానికులను కలచివేసింది. పండుగ రోజున ఆనందంగా ఇంటికి వచ్చిన శివ ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఏడుగురిపై కేసు.. పరారీలో నిందితులు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడుగురిపై BNS సెక్షన్లు 182(2), 103(2), 115(2), 1905 సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనలో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
MK గ్రూప్పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మణుగూరులో _ MK గ్రూప్ పేరుతో కొందరు యువకులు తరచూ గొడవలు, దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రూప్లో సుమారు 80 మంది వరకు ఉన్నారని, నిత్యం వివాదాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలోనూ ఈ గ్రూప్పై ఫిర్యాదులు ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి హత్యకు కారణమైన వారి పరిచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు









