కరకగూడెం : సెర్ప్ “స్వయం శక్తి మండల మహిళా సమాఖ్య “కరకగూడెం కార్యాలయం లో శనివారం జరిగిన వీఓ ఏ ల సమీక్ష సమావేశం జరిగింది, ఈ సమీక్ష సమావేశం లో మండలం లోని అన్ని సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలి, దాని కొరకు, “నిత్యం సరైన సమయం లో సమావేశం లు నిర్వహించడం,
ఆర్ధిక లావాదేవీలు ఆన్లైన్లో పొందుపరచడం
తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిపులు చేయుట,
తిరిగి కొత్త రుణాలు తీసుకొని నూతన వ్యాపారాలు, జీవనోపాధులు పెంచుకునుట తద్వారా అదనపు ఆదాయం ఆర్జించి కుటుంబాలు ఆర్ధికంగా సుస్థిరత కు చేరుకోవాలి అని ఆ విధంగా వీఓ ఏ లు గ్రామాల్లో పని చేయాలని ఆదేశించారు, ఈ సందర్బంగా ప్రాజెక్టు ప్రాధాన్యత అజెండా అంశాలు అయిన సంస్థగత నిర్మాణం, బాంకు లింకేజి, స్త్రీనిధి, జీవనోపాదులు, ఎంటర్ ప్రైజెస్ ఏర్పాట్లు,ఆసరా పెన్షన్ లు, వితంతు, ఒంటరి స్త్రీ పెన్షన్ లు సదరం సర్టిఫికెట్ లు, ఓపెన్ విద్య “టాస్ “తదితర అంశాలు పై సమీక్ష జరిపారు ఈ సమావేశం లో
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లు సంస్థగత నిర్మాణం మరియు మానవభివృద్ధి విభాగం మరియు వయోజన విద్య సురేష్ రెడ్డీ, వ్యవసాయం,మరియు బ్యాంకు లింకేజీ విభాగం సమ్మక్క, ఆసరా పెన్షన్ లు మరియు సదరం విభాగం నర్మదా రెడ్డీ లు సమీక్ష లు జరుపుతూ ఈ విభాగాలలో గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా పని చేయాలని వీవో ఏ లకు లక్ష్యాలు నిర్దేశం చేసారు.మరియు ఈ సమీక్ష సమావేశం లో ఎపిఎం వినోద్ క్రాంతి, మండల సమాఖ్య అధ్యక్షులు సరస్వతి సీసీ సత్యనారాయణ, వీఓ ఏ లు పాల్గొన్నారుఎపిఎం వినోద్ క్రాంతి, మండల సమాఖ్య అధ్యక్షులు సరస్వతి సీసీ సత్యనారాయణ,వీవో ఏ లు పాల్గొన్నారు.









