తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజుల ప్రజా పాలన

1000 రోజులు… ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి వెయ్యి అడుగులు.

ఇది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం!

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

 

కరకగూడెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు, DCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రంలో సంక్షేమం పరుగులు పెడుతోందని అన్నారు.ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది ప్రచార ప్రభుత్వం కాదు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని  స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్,ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగ బండి వెంకటేశ్వర్లు, సర్పంచ్ లు పోలేబోయిన సుజాత, ఎర్రం పొట్టయ్య, బాడిష పార్వతి, ఉప సర్పంచ్ పూజారి వెంకన్న,SC సెల్ అధ్యక్షులు జాడి శ్రీను, మాజీ ఎంపీటీసీ బిజ్జా రామనాథం, మాజీ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram