ఇకపై వెహికల్స్‌పై ఇవి ఉంటే జరిమానా తప్పదు!

ఇకపై వెహికల్స్‌పై ఇవి ఉంటే జరిమానా తప్పదు!

 

కార్ల మాడిఫికేషన్స్‌పై కేంద్ర రవాణా శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

 

సెక్షన్ 52 ప్రకారం స్టీల్ బంపర్లు బిగించడం, నంబర్ ప్లేట్ రూపాన్ని మార్చడం, కార్ అద్దాలపై పెద్ద స్టిక్కర్లు వేయడం (సెక్షన్ 177), బ్లాక్ ఫిల్మ్‌లు, సన్‌షేడ్లు లేదా మాగ్నెటిక్ కర్టెన్లు వాడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

 

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు మాడిఫై చేస్తే జరిమానాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా వర్తించదని తెలిపింది.

 

ఈ మార్పుల వల్ల ఎయిర్‌బ్యాగ్స్ సరిగా పనిచేయకపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram