వైయస్సార్ వర్ధంతి వేడుకలు

కరకగూడెం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను బుధవారం కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాలు హుస్సేన్ వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ..నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌ పాలన సాగించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram