ఐటిఐ మరియు ఏటీసీ ట్రేడ్లలో గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పన

ఐటిఐ మరియు ఏటీసీ ట్రేడ్లలో గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పన

ఐటీడీఏ పిఓ బి రాహుల్

 

భద్రాచలం : కృష్ణ సాగర్ ఆర్ ఐ టి ఐ లో నూతనంగా ప్రవేశపెట్టిన ఏ టి సి శిక్షణ ద్వారా గ్రామీణ యువతకు వివిధ రకాల ట్రేడ్లలో శిక్షణ అందించడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.

 

బుధవారం నాడు రాత్రి తన చాంబర్లో ఐటిఐ ప్రిన్సిపాల్ సమక్షంలో ఏ టి సి అడ్మిషన్లకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటిసి కోర్సులలో చేరే యువకులకు అధునాతన పరికరాలను ఉపయోగించే ఆర్టిసాన్, ఇండస్ట్రియల్ మరియు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్, సిఎంసి మ్యాచింగ్ టెక్నీషియన్, స్కానర్ బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి కోర్సులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.

 

ఈ నెల 5వ తేదీ వరకు సంబంధిత గ్రామీణ యువకులు ఏ టి సి కోర్సులలో చేరే విధంగా సంబంధిత గ్రామాల ఉద్యోగులు స్వయం సహాయక మహిళలు గ్రామీణ యువకులను గుర్తించి ఆర్ ఐ టి ఐ కృష్ణ సాగర్ దరఖాస్తులు చేసుకునేలా చొరవ చూపాలని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు ఐటిఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram