సెప్టెంబర్ 3, 2026 వాతావరణ సూచన
నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం!
హైదరాబాద్ : గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ, నేటి నుంచి వర్షాల తీవ్రత తగ్గనుంది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు మధ్యాహ్నం వరకు అడపాదడపా కొనసాగవచ్చు.
నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మొత్తంగా తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇతర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు లేదా పొడి వాతావరణం కొనసాగవచ్చు.
హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.









