కాంగ్రెస్ పాలనపై మణుగూరులో BRS యూత్ పోరుబాట

1000 రోజుల విఫల కాంగ్రెస్ పాలనపై మణుగూరులో BRS యూత్ పోరుబాట

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

 

గోల్డెన్ న్యూస్/ మణుగూరు /తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS పార్టీ పినపాక నియోజకవర్గం యువజన విభాగం నాయకులు మండిపడారు.

ప్రభుత్వంపై BRS పార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా మణుగూరులో ప్లకార్డులతో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై శనివారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మణుగూరులోని BRS పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు యువజన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం మణుగూరు తహశీల్దార్ (M.R.O) గారికి నిరుద్యోగుల తరపున డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా BRS యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన రూ. 8,832 కోట్లు బాకీ పడి, యువతను తీవ్రంగా వంచించిందని ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో ఏటా జాబ్ క్యాలెండర్,నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి,పెండింగ్ లోఉన్న ఫీజు రియింబర్స్ మెంట్,యువతకు వడ్డీ లేకుండా పది లక్షలు రుణాలు ఇస్తామని,అదేవిధంగా

జిల్లాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు,నియోజవర్గంలో క్రీడాకారుల కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు,చదువుకునే విద్యార్థులకు ఉచిత స్కూటర్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్,ఇప్పటివరకు ఆ హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల పరిస్థితి “ఎక్కడేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, మహిళల తరపున ఎల్లప్పుడూ నిలదీస్తూనే ఉంటామని,వారికి BRS పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ మణుగూరు, అశ్వాపురం కరకగూడెం పినపాక మండలాల BRS పార్టీ యువజన విభాగం అధ్యక్షులు భోశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్,

గద్దల రామకృష్ణ,గుడ్ల రంజిత్ కుమార్,చెన్న కేశవులు,జిల్లా యువజన నాయకులు పద్దం శ్రీనివాస్,ఆవుల శ్రీను,జక్కం రంజిత్,సూర్యం,నజీర్ సోను,చల్లా రాజేష్,పవన్,డేగల సంపత్,బాజీ,బోశెట్టి దీపక్, సతీష్,సాధనపల్లి లక్ష్మీనారాయణ మొదలగు యువజన నాయకులు,విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram