ఉల్లిపాయలు, కందిపప్పు ధరల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ : నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది.

 

వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లలో, అలాగే మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను కిలో రూ.32కే అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్తో పాటు కందిపప్పును కూడా సబ్సిడీపై అందించనుంది. మార్కెట్ ధర కంటే 25 నుంచి 30 శాతం తక్కువ ధరకు కందిపప్పు, పామాయిల్ ఇవ్వనున్నారు.

 

వెయ్యి మీమార్ట్ స్టోర్స్ అక్టోబర్ 1 నాటికి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram