కోటీశ్వరుడైన మామను తుదముట్టించిన కోడలు

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / కాన్పూర్‌లో ప్రముఖ వ్యాపారి వినీత్ మినోచా హత్య కేసును ఛేదించిన పోలీసులు: రూ. 6 లక్షల సుపారీ ఇచ్చి పాత నౌకరుతో చేయించిన దారుణం

 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ కోటీశ్వరుడు, ఔషధ వ్యాపారి వినీత్ మినోచా (Vinit Minocha) హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ ఘోర హత్యకు స్వయంగా ఆయన కోడలు శాలు (Shalu) మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. తన విలాసవంతమైన ఖర్చులపై మామగారు ఆంక్షలు విధించడమే కాకుండా, డబ్బు విషయంలో కఠినంగా ఉండటంతో కక్ష పెంచుకున్న కోడలు..

 

ఏకంగా రూ. 6 లక్షల సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది.పార్టీ నెపంతో పక్కా ప్లాన్:పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి శాలు, ఆమె భర్త సుబ్రత్ తమ 6 ఏళ్ల కుమారుడితో కలిసి రాత్రి 9:36 గంటల ప్రాంతంలో ఒక పార్టీకి వెళ్లారు. వారు వెళ్లిన 10 నిమిషాలకే ఇంట్ నుంచి తీసేసిన పాత నౌకరు విశాల్, అతని స్నేహితుడు రాజ్‌కిషోర్ నకిలీ తాళాలతో ఫ్లాట్ లోపలికి ప్రవేశించారు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే దాక్కుని, వినీత్ మినోచా రాక కోసం వేచి చూశారు.గుండెపోటుగా చిత్రీకరించాలని చూసి.. చివరికి కత్తులతో:నిజానికి వినీత్ మినోచా పడుకున్న తర్వాత దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి, అది గుండెపోటు లేదా సహజ మరణంగా నమ్మించాలని నిందితులు ప్లాన్ చేశారు.

 

కానీ రాత్రి 10:58 గంటలకు ఇంటికి వచ్చిన వినీత్, ఊహించని విధంగా పిల్లల గదిలోకి వెళ్లారు. అక్కడ దాక్కున్న నిందితులను చూసి ఆయన కేకలు వేయబోగా, భయపడిపోయిన హంతకులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఆయన గొంతు, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు.కన్నీరు కార్చిన కోడలు.. సీసీటీవీతో దొరికిన ఆధారాలు:ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పార్టీ ముగించుకుని కొడుకు, కోడలు ఇంటికి వచ్చేసరికి వినీత్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటన తర్వాత మామగారు అంటే తనకు ఎంతో ఇష్టమంటూ కోడలు శాలు పోలీసుల ముందు విపరీతంగా ఏడుస్తూ డ్రామా ఆడింది. అయితే ఇంట్లో ఎలాంటి నగదు, నగలు చోరీ కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.అపార్ట్‌మెంట్ లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, 6 ఏళ్ల క్రితం దొంగతనం ఆరోపణలపై ఇల్లు వదిలి వెళ్లిన పాత నౌకరు విశాల్ లోపలికి వెళ్లడం కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటల్లోనే ఎన్‌కౌంటర్ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.రూ. 6 లక్షల ఒప్పందం:పోలీసుల విచారణలో నిందితులు అసలు నిజాన్ని వెల్లడించారు.

 

తాము శాలు (భాభి) చెప్పడం వల్లే ఈ హత్య చేశామని, ఇందుకు గానూ రూ. 6 లక్షల సుపారీ కుదిరిందని, అడ్వాన్స్ గా రూ. 2 లక్షలు అందాయని ఒప్పుకున్నారు. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ మామగారు ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడమే శాలు ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శాలుతో పాటు హంతకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram