గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణసచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSIDC)లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మరో ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ACB) వలకు చిక్కారు. అధికారిక పని చేయడానికి లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ACB అధికారులు రెడ్్యండెడ్గా పట్టుకున్నారు.
ACB తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ (AO-1), బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్లో ఉన్న TSIDC కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ACB తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ (AO-1), బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్లో ఉన్న TSIDC కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) లంచం కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకం కింద మంజూరైన వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్స్ను ప్రాసెస్ చేయడంతో పాటు, మంజూరైన రూ.2 లక్షల మొత్తానికి చెక్కు జారీ చేయడం, మిగిలిన వైద్య రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను తదుపరి ప్రాసెస్ చేయడానికి నిందితులు లంచం డిమాండ్ చేసినట్లు ACB పేర్కొంది
నిందితులను నాంపల్లిలోని SPE & ACB కేసుల కోసం ఏర్పాటు చేసిన | అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు ACB తెలిపింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ACB అధికారులు వెల్లడించలేదు.









