కరకగూడెం మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీలకు పోలీస్ వారి ముఖ్య సూచన
కరకగూడెం : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్న మండప నిర్వాహకులకు కరకగూడెం ఎస్సై పీవీఎన్ నాగేశ్వరరావు పలు సూచనలు చేశారు. మండపాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. ఆన్లైన్ చేసిన వారు అప్లికేషన్ను కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని తెలిపారు. అప్లికేషన్ను పరిశీలించిన తర్వాత మీకు గణేశుని నిలిపేందుకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది . మండలంలోని గణేష్ ని పెట్టాలనుకున్న ప్రతి ఒక్క భక్తుడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు.
Post Views: 58









