మృతుని జాతిపై కత్తిగాట్లు
ఆళ్లపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ సుద్ధరేవు గ్రామానికి చెందిన పూనేం రామ్ నారాయణ (50) శనివారం మర్కోడు జల్లేరు వాగు పరిసరాల్లో మృతదేహంగా కనిపించాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రామ్ నారాయణ వలస గొత్తికోయ తెగకు చెందిన వ్యక్తి. గత నాలుగు సంవత్సరాలుగా సుద్ధరేవు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. భూతవైద్యం చేస్తుంటాడని, మృతుడు మర్కోడు పరిసర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే మృతుడి ఛాతిపై కత్తితో దాడి చేసినట్లు ఆనవాళ్లు కనపడటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఘటనపై స్థానిక ఎస్సై సోమేశ్వర్ మాట్లాడుతూ… మృతుడి చాతి పై కత్తితో దాడి చేసినట్టు ప్రాథమికంగా కనిపిస్తుందని తెలిపారు. హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల అసలు కారణాలు వెళ్లడవుతాయని ఎస్ఐ తెలిపారు.









