కరకగూడెం : గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు.
పినపాక అభివృద్ధి అంటేనే పాయం.. పాయం అంటేనే అభివృద్ధి!
పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల HAM నిధులు మంజూరు — సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం మంగళవారం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని గ్రామపంచాయతీ ఖాతాలోనే జమ చేసుకుని, స్థానిక అభివృద్ధి అవసరాలకు తీర్మానం ద్వారా వినియోగించుకునే వెసులుబాటు కల్పించేలా పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3)కు సవరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ చట్ట సవరణతో గ్రామపంచాయతీలు తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు.
పినపాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో HAM నిధుల నుంచి రూ.186 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అభిమాన నాయకులు పాయం వెంకటేశ్వర్లు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూ.186 కోట్ల HAM నిధుల మంజూరుకు సహకరించిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధి అంటేనే పాయం.. పాయం అంటేనే అభివృద్ధి అని, పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నిధులు తీసుకువస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వం అభినందనీయమని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు అన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని, పేదలు, రైతులు, మహిళలు, యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేరేలా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరరావు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షులు కల్తీ విజయ్, సర్పంచ్ లు ఎర్రం పొట్టయ్య, పోలేబోయిన సుజాత, తోలెం రమేష్, కొమరం సుగుణ, ఎల్లబోయిన ముత్తమ్మ, బాడిష పార్వతి,ఉప సర్పంచ్ లు పూజారి వెంకన్న, పోలేబోయిన రాణి, పోలేబోయిన స్వర్ణలత,Sc సెల్ అధ్యక్షులు జాడి శ్రీను, సీనియర్ నాయకులు నేతాజీ, అత్తే సారయ్య, కోర్స బుచ్చయ్య, మండల నాయకులు షేక్ రఫీ, పాలేబోయిన సీతారాంబాబు, ఎల్లబోయిన సత్యం ,మోకాళ్ళ పాపారావు తోలెం కృష్ణ, సోలం బాబు, కరకపల్లి నాగేష్,అత్తే నరసింహారావు,గోగు కిరణ్,కటకం నరసింహారావు, వడ్లకొండ సాంబ,మాజీ ఉప సర్పంచ్లు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,బూత్ – గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..









