కరకగూడెం : మండలంలో వివిధ రకాల చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. కరకగూడెం పంచాయతీ పరిధిలో ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కలిసి ఒకటో వార్డు, మూడో వార్డు లలో దరఖా స్తుదారుల దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి స్వయంగా వివరాలను పరిశీలించారు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులు చేసుకున్న దరఖా స్తులను పరిశీలించి అర్హతకు సంబంధించిన వివరాలను సేక రించినట్లు ఎంపీడీఓ తెలిపారు. పరిశీలన అనంతరం వివరా లను చేయూత యాప్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 13









