దానం నాగేందర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్పై పోటీ చేసినప్పటి నుంచి దానం (2024, ఏప్రిల్ 23)పై అనర్హత వర్తిస్తుందని సంచలన తీర్పు వెలువరించింది.దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ఈ మేరకు తెలంగాణ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram