కరకగూడెంలో మతసామరస్యం గణేశుడి లడ్డూ దక్కించుకున్న ముస్లిం భక్తుడు!

కరకగూడెంమతసామరస్యం గణేశుడి లడ్డూ దక్కించుకున్న ముస్లిం భక్తుడు!

 

కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో వినాయక చవితి ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాట మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడి వినాయక మండపంలో కొలువై ఉన్న గణనాథుని ప్రసాదమైన లడ్డూను కరకగూడెం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వేలం పాటలో దక్కించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేలం పాటలో స్థానికులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా పాడారు. చివరికి, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అత్యధికంగా ₹3,116 పలికి స్వామివారి దివ్య ప్రసాదమైన లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, గణేష్ కమిటీ సభ్యులు ఇక్బాల్ హుస్సేన్‌ను అభినందించారు. కులమతాలకు అతీతంగా, భక్తితో ఆయన గణపతి లడ్డూను దక్కించుకోవడం ద్వారా కరకగూడెం గ్రామంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, మతసామరస్యాన్ని చాటిచెప్పారని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వినాయక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram