అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

కరకగూడెం : మండల పరిధిలోని కలవలనాగారం గ్రామంలో చోటుచేసుకున్న ఓ యువకుడి మృతి తీవ్ర సంచలనంగా మారింది. వ్యవసాయం చేసుకునే భగవత్ రవిచంద్ర  (26) సోమవారం ఉదయం ప్రధాన రహదారి పక్కన విగత జీవిగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకునే మృతికి గల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram