హత్య చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన.
కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామానికి చెందిన బదావత్ రవిచంద్ర ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యను కరకగూడెం గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, హత్య చేసిన వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు కరకగూడెం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. స్థానిక పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు .
Post Views: 143









