మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామానికి చెందిన ధారావత్ రవిచంద్ర (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మణుగూరు ఇన్చార్జి డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు.
కలవల నాగారం గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తమ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతి చెందిన వ్యక్తి ధారావత్ రవిచంద్రగా గుర్తించినట్లు తెలిపారు. రవిచంద్రన్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి తనతో తీసుకెళ్లాడని ఈ తరుణంలో హత్య చేసి ఉంటాడనే అనుమానాన్ని మృతుడి తల్లి ఫిర్యాదులో వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
Post Views: 18









