రూ .12లక్షలు ఇచ్చిన బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ రెడ్డి
యాజమాన్యాలంటే పని చేయించుకోవడం తప్ప ఉద్యోగుల బాగోగులు కనీసంగా పట్టించుకోని ఈ రోజుల్లో ఓ ఉద్యోగి వైద్యానికి నిమిషాల్లో 12 లక్షల రూపాయలు బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఇచ్చి తన సిబ్బందిపై తన ఔదార్యం చూపించారు.
ఢిల్లీ రిపోర్టర్ గా పని చేస్తున్న శివకు గురువారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయింది. కంగారుపడిన అతని భార్య పక్కనే ఉండే ఎన్టీవీ రిపోర్టర్ రాజుకు సమాచారం అందించారు.
శివ పరిస్థితి గమనించిన రాజు.. వెంటనే మాక్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
రాజు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకుపోవడంతో వైద్యులు చికిత్స మొదలు పెట్టారు.
చికిత్స కోసం 12లక్షల రూపాయలు అవుతాయని చెప్పడం, దాన్ని బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి.
విషయం తెలియగానే బిగ్ టీవీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 12 లక్షల రూపాయలను ఆస్పత్రికి పంపించారు
వెంటనే ప్రొసీజర్ చేయడంతో ప్రాణాపాయం నుంచి శివ బయటపడ్డారు.
బిగ్ టీవీ చైర్మన్ పెద్ద మనసుకు బిగ్ టీవీ సిబ్బందే కాదు… మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఓ యాజమాన్యం ఓ ఉద్యోగి కోసం ఇంత మొత్తం ఖర్చు పెట్టడం ఇప్పటి వరకు లేదని మీడియా మిత్రుల్లో చర్చ జరుగుతోంది.









