అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని తురకపల్లి రోడ్డులో ఉన్న లక్ష్మీ క్లినిక్ లో నిబంధనలకు విరుద్ధంగా రోగులకు వైద్యం అందిస్తున్నారని జిల్లా వైద్యాధికారిని బ్రమరాంబికా దేవికి సమాచారం తెలియడంతో జిల్లా వైద్యాధికారి బృందంతో కలిసి లక్ష్మి క్లినిక్ ని తనిఖీ చేశారు.ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆస్పత్రి నడుపుతున్న ఆర్ఎంపీ డాక్టర్ శేఖర్ వచ్చిన పేషెంట్లకు సెలైన్ బాటిళ్లు పెట్టి, వారికి చికిత్స అందిస్తున్నారని నిర్ధారణకు వచ్చి క్లినిక్ ను సీజ్ చేశారు.ఇలాంటి క్లినిక్ లు గుత్తిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.ఆర్ఎంపీ డాక్టర్లు క్లినిక్లను నడుపుతూ డబ్బులు దోచుకుంటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.కొందరు జిల్లా అధికారులకు ముడుపులు ముట్టిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని వారి పై విమర్శలు కూడా ఉన్నాయి.
Post Views: 440