నగల కోసం కన్నతల్లిని అడవిలో వదిలేసిన కూతురు

ఈ లోకంలో తల్లిదండ్రులే  కనిపించే దైవ స్వరూపం. వారు మనల్ని కని, పెంచి, ప్రయోజకులను చేయడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టి పిల్లలను చేస్తుంటారు.

కన్న తల్లిని అడవిలోకి తీసుకెళ్లి మెడలోని ఆభరణాలు తీసుకొని వదిలేసిన కూతురు.

తిండీతిప్పలు లేక రెండురోజులు అడవిలోనే తిరిగిన వృద్ధురాలు.

గోల్డ్ న్యూస్ / జగిత్యాల :  ఇస్లాంపుర వీధిలో ఉండే వృద్ధురాలు బుధవ్వకు  ఈశ్వరీ అనే కూతురు ఉంది అయితే రెండురోజుల క్రితం తల్లిని స్థానిక అడవిలోకి తీసుకెళ్లిన ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని అక్కడి నుంచి పరావర్ అయ్యిందిరెండు రోజుల తర్వాత అటుగా వెళుతున్న  యువకులు గమనించి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. బుధవ్వను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.రెండు రోజులపాటు ఆకలి దప్పికలకు అలమటించిన వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది.ఈ లోకంలో తల్లిదండ్రులే  కనిపించే దైవ స్వరూపం ఉంటారు. వారు మనల్ని కని, పెంచి, ప్రయోజకులను చేయడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టి  పిల్లలను ప్రయోజకులను చేస్తుంటారు. వారి కడుపు మాడ్చుకుని పిల్లల  ఆకలి తీరుస్తారు. తమ సంతోషాన్ని త్యాగం చేసి పిల్లలు సంతోషంగా ఉండటానికి ఏదైనా చేస్తారు. అలాంటి తల్లిదండ్రులను చివరి దశలో నిర్లక్ష్యం చేయడం, వారిని బాధపెట్టడం అత్యంత హీనమైన చర్య. ఈ సంఘటనలో కూతురు చేసిన పని క్షమించరానిది తన స్వా ర్థంథం కోసం డబ్బు కోసం అత్యంత భాషావికంగా అడవిలో వదిలివేయడం మానవత్వానికే కళంకం. ఇలాంటి వారిని చట్టం శిక్షిస్తుందో లేదో కానీ.  ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల వారు మాత్రం మండిపడుతున్నారు. జగిత్యాల శివారు అడవిలో ఒంటరిగా.. దిక్కులేనిదానిలా రెండు రోజులుగా తిండి తిప్పలు లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ తల్లిని చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. బుధవ్వకు ఈశ్వరి అనే కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి.. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి ఇప్పుడు ఆమెకు భారం అయింది. కన్నబిడ్డల కోసం తన కడుపు నింపుకోకుండా ఎన్నోసార్లు పస్తులుండి, వారి ఆకలి తీర్చిన ఆ మాతృమూర్తికి చివరికి ఎదురైన గతి ఇది.కూతురే స్వార్థంతో కన్నతల్లిని అడవిలో వదిలేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు తీసుకుపోయింది.  హృదయ విదారక ఘటన కన్నబిడ్డల బాధ్యతారాహిత్యాన్ని, స్వార్థాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రుల సేవ కంటే గొప్ప పుణ్యం ఏదీ లేదు. వారి కన్నీళ్లకు కారణమైన వారికి ఎప్పటికీ శాంతి ఉండదు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram