పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

NEET (UG)-2025 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు.

జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న 1176 మంది అభ్యర్థులు

 పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న NEET ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శుక్రవారం తెలిపారు.జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలయిన కొత్తగూడెంలోని సింగరేణి ఉమేన్స్ కళాశాల,పాల్వంచ లోని TGSWR స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్(girls) మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (KSM) వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించబోయే అధికారులతో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలను చేయడం జరిగింది.

అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డులో సూచించబడిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

 

♦ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడును.

 

♦ పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును.

 

♦ పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గానీ,ఆభరణాలను గానీ, షూస్,సాక్స్,బెల్ట్ లు (ఉదా : చెవి దిద్దులు,క్లిప్పులు,రింగులు, మెట్టెలు,చైన్లు మరియు ఇతర ఆభరణాలు మరియు తాళ్ళు,తాయేత్తులు) బ్యాగులు లాంటివి అనుమతించబడవు.ఇలాంటివి ఏమీ లేకుండా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించడం జరుగుతుంది.

 

♦ పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద పురుషులను,స్త్రీలను వేరు వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

 

♦అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, గుర్తింపు కార్డు మరియు రెండు పాస్పోర్ట్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటోను తమ వెంట తప్పనిసరిగా తీసుకొని రావలెను.

 

♦ పరీక్షా కేంద్రాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి.

 

♦ పరీక్షా కేంద్రాల నుండి 200 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదు.

 

♦ పరీక్ష రోజున పరీక్షా కేంద్రాలకి దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు,కంప్యూటర్ సెంటర్లు మూసివేయబడును.

 

♦పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరిని ముందుగానే బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి,పరీక్ష రాసే సమయంలో వీడియోగ్రఫీ చేయబడును.

 

♦ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులకు మంచినీటి సౌకర్యం మరియు అత్యవసర వైద్య సేవలకు గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

♦ జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలలో హాజరు కానున్న అభ్యర్థుల కొరకు కొత్తగూడెం బస్టాండు,రైల్వే స్టేషన్ మరియు ప్రధాన కూడళ్లలో,బస్సులు ఆగు స్థలాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనుటకై QR కోడ్ ను అంటించడం జరుగుతుంది.

 

♦ అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఎలాంటి పెన్నులు,పెన్సిల్స్ తీసుకురావద్దు.పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ప్రతి ఒక్కరికి బ్లాక్ బాల్ పెన్ ఇస్తారు.

 

♦ పరీక్షకు హాజరయ్య అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లకు సంబంధించిన ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram