ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మే 5 నుంచి వాట్సాప్ పనిచేయదు !

ఇప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.  ప్రతి స్మార్ట్  ఫోన్లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెసేజ్ యాప్ గా వాట్సాప్ ప్రాధాన్యత పొందింది. అయితే ఈ యాప్ గురించి ప్రజలకు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు. ఈ నెల 5వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఫోన్లు యూస్ చేస్తున్న వారు చింతించాల్సిన అవసరం లేదు. మే 5వ తేదీ నుంచి iOS వినియోగదారులకు మాత్రమే వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుందని సమాచారం. మెటా సంస్థ కస్టమర్లకు మరింత సౌకర్యం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.

 

ఈ యాప్ వాడుతున్న ఫోన్ల విషయంలో కూడా మెటా సంస్థ అనేక జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెటా సంస్థ పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయబోతుంది.15.1 కన్నా ముందు ఐఓఎస్ వర్షన్ ఉన్న ఐఫోన్లలో మే 5 నుంచి వాట్సాప్ పనిచేయదు అని సమాచారం. వీటిలో ఐఫోన్ 5 ఎస్ అలాగే ఐఫోన్ 6 ఉన్నాయి. కానీ ఈ ఐఫోన్ మోడల్ లో కేవలం ఐఓఎస్ 12.5.7 వరకు మాత్రమే సపోర్ట్ చేయగలవు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ మోడల్స్ ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ సేవలు అన్ని అంటే మెసేజ్లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అలాగే నోటిఫికేషన్లు అన్నీ పనిచేయవు.

 

ఈ మోడల్స్ ఐఫోన్లకు ఆపిల్ సంస్థ సాఫ్ట్వేర్ అప్డేట్ అందించడం కూడా నిలిపివేసింది. ఈ క్రమంలో అవి భద్రత లోపాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ క్రమంలోనే మెటా సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram