పిడిఎస్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు వద్దు
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం అమ్ముకుంటున్న వారికి రెవెన్యూ అధికారులు షాక్ ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లోని అచలాపూర్ గ్రామంలో 11 రేషన్ కార్డులను రద్దు చేశారు. లబ్ధిదారులు కేజీకి రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు గుర్తించారు. బియ్యం అమ్మిన, కొన్న వారిపై చర్యలు తప్పవని తహశీల్దార్ హెచ్చరించారు.
Post Views: 46









