గోల్డెన్ న్యూస్ భద్రాచలం : అర్హత లేని వైద్యులు , కాలం చెల్లిన మందులు,వసతులు లేని ఆసుపత్రులు వైద్యం పేరుతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం నిగా పెట్టి ఆసుపత్రులు నిర్వహిస్తున్న యజమానులపై, వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తుందని. లేని పక్షంలో బాధితులతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడతామని CPIML మాస్ లైన్ జిల్లా నాయకురాలు కె. కల్పన హెచ్చరించారు.
ఇటీవల సత్తుపల్లి పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చింతలపూడి మండలం కోటపాడు గ్రామానికి చెందిన పాముర్తి జ్యోత్స్న అనే వివాహత మహిళ ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ అనంతరం మృతి చెందింది, దాంతో బంధువులు ఆందోళన చేపట్టడంతో విషయం బయటపడింది ఈ విషయంపై స్పందించిన సత్తుపల్లి DMHO డాక్టర్ సీతారాం సంబంధిత ఆసుపత్రిని సందర్శించి పరిశీలించగా కాలం చెల్లిన మందులు వాడినట్లు అర్హత లేని డాక్టర్ సరికొండ హర్షిత్ ఆపరేషన్ చేశారని, ఆసుపత్రిలో సరైన వసతులు లేవని డిఎంఎస్ఓ ప్రకటించారు. ఇలాంటివి జరగకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం నిఘ పెట్టి రోగుల ప్రాణాలను కాపాడాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. చనిపోయిన మహిళ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుందన్నారు. లేనియెడల ఆందోళన చేపడుతావని హెచ్చరిస్తున్నది.









