అకాల వర్షానికి కొట్టుకుపోయిన కొనుగోలు కేంద్రంలోని 400 ఎకరాల దాన్యం రాశులు ..
గోల్డెన్ న్యూస్ / ఏటూర్ నాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు.కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ లోపం, లోడింగ్ కు సిద్దంగా ఉన్న ధాన్యం బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే కారణమంటున్న బాదిత రైతులు.
క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లర్లు లోడింగ్ తీసుకుంటామన్నారని రైతుల ఆరోపణ.. తెల్లవారితే మిల్లుకు వెళ్లాల్సిన ధాన్యం బస్తాలు కూడా వరదలో తడిసి ముద్దాయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు..
జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అధికారులతో అంచనా వేసి నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్న రైతులు.
Post Views: 63









