గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అశ్వాపురం మండలం బట్టీలగుంపు గ్రామంలో కురిసిన వర్షానికి ఓ పూరిగుడిసె కుప్పకూలింది. గ్రామానికి చెందిన కొమరం పుల్లయ్య భార్య, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పూరిగుడిసెలో నివసిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి పూరిగుడిసె కుప్పకూలింది. నిలువ నీడను కోల్పోయిన బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి బట్టా సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 63









