కరకగూడెం మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడిగా సిద్ది సునీల్

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల బీఆర్ఎస్ పార్టీ  సోషల్ మీడియా అధ్యక్షునిగా సునీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన అధ్యక్షుడు సిద్ధి సునీల్  మాట్లాడుతూ.. ముందుగా తనపై నమ్మకంతో సోషల్ మీడియా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి మండలంలో పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.అధికార పక్షం అబద్దాలతో ప్రజలను మోసం చేసే తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తానని అన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram